గంట్యాడ మండలం మదనాపురం గ్రామంలో కలువ పువ్వుల కోసం చెరువులోకి దిగిన అదే గ్రామానికి చెందిన లగుడు సురేష్ అనే వ్యక్తి చెరువులో ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందినట్లు సోమవారం మధ్యాహ్నం గంట్యాడ పోలీసులు తెలిపారు. మదనపురానికి చెందిన లగుడు సురేష్ కలువ పువ్వుల కోసం చెరువులోకి బాగా లోతుగా వెళ్లడంతో అందులోనే మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.