అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స కోసం వచ్చి మృతి చెందిన సంఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఛాతిలో నొప్పి రావడంతో అనంతపురం ఆసుపత్రికి వచ్చిన అతను తన పేరు గణేష్ అని చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతనిని రక్షించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిర్ధారించారు. అతనికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని వారు వెల్లడించారు.