ఎన్నికలకు ముందు ఆటో, మోటార్ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని ఐ.ఎఫ్.టి.యు. రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావులు డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో ఏలూరు జూట్ మిల్లు సెంటర్లో ఆటో కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆందోళనకారులు మాట్లాడుతూ అందరూ ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసారు.