భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్ళపల్లి మండలం కొరికిశాల కస్తూర్బా గాంధీ పాఠశాల హాస్టల్ ను గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతితో కలిసి పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థకు గురై చనిపోయిన సంఘటనలు ఉన్నాయని,అలాంటి సంఘటనలు భూపాలపల్లి నియోజకవర్గంలో జరగకుండా అధికారులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని తెలిపారు.