వెంకటగిరి పట్టణంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. అడ్డ రోడ్డు నుంచి పాల కేంద్రానికి వచ్చే దారిలో బైక్పై వస్తున్న ఇద్దరు బైక్ స్కిడ్ కావడంతో కింద పడిపోయారు. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.