నల్లగొండ జిల్లా: త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలుస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సోమవారం అన్నారు. ఈ సందర్భంగా సోమవారం మునుగోడు సిపిఐ కార్యాలయంలో జరిగిన మండల కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ దక్షిణ భాగంలో చేపడుతున్న భూ సేకరణలో దిగిస్ కంపెనీ భూములను కాపాడే కుట్రలో భాగంగా పలుమార్లు అలైన్మెంట్లు మార్చారని ఆరోపించారు.దీని కారణంగా పచ్చని పంట పొలాలు చెలకలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని అన్నారు.