పరిపాలన అంటే ప్రజలకు ఏం కావాలో అది చేయడమేనని, గత ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్లో రౌండ్ తూము వద్ద రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజలు, టిడిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.