రామయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ శివ దయాల్ సందర్శించారు ఈ సందర్భంగా రికార్డులను, ఆసుపత్రిలో మందుల నిల్వలు రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.వైద్య సేవల గురించి ఆయన రోగులను అడిగి తెలుసుకున్నారు రోజువారి OP సేవలు పలు రికార్డులను పరిశీలించారు ప్రజల కు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో ఇటీవల కాలంలో చిన్న పిల్లల వైద్యులను కూడా ఏర్పాటు చేశామన్నారు