పెద్దవడుగూరు మండల కేంద్రంలోని మండల్ పరిషత్ కార్యాలయాన్ని గురువారం జిల్లా పంచాయతీ ఆఫీసర్ (డీపీఓ) నాగరాజు నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిషత్ కార్యాలయంలోని అన్ని రకాల అధికారులను పరిశీలించారు. ఉపాధి హామీకి సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించారు. అనంతరం చిన్న వడుగూరు గ్రామానికి వెళ్లి అక్కడ మండల పరిషత్ నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.