శనివారం రోజున తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో నవారు మంచాలపై పేషంట్లను పడుకోబెట్టి ట్రీట్మెంట్ అందించిన అంశం సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ఆరోపణలను ఖండించారు. పెద్దపల్లి పాత ఆసుపత్రి భవనం శిథిల వ్యవస్థకు చేరి కూల్ చేసి నూతన భవనాలు ఏర్పాటు చేసే క్రమంలో పాత భవనాలు కూల్చడంతో పక్కనే ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో హాస్పిటల్ నిర్వహిస్తున్నామని హాస్పిటల్ కెపాసిటీకి మించి రెండు వందల నలభై మూడు బెడ్లను ఏర్పాటు చేసి పేషెంట్లకు వైద్యం అందిస్తుందమన్నారు . ప్రభుత్వ ఆసుపత్రి పై తప్పుడు ప్రచారం మానుకోవాలంటూ హెచ్చరించారు