రైతుల అభివృద్ధికి ఓటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వారికి అండగా నిలుస్తుందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రావు అన్నారు. జగన్నాధపురం లో నియోజవర్గ స్థాయి ఏరువాక పౌర్ణమి కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. పలువురు రైతులకు 80% రాయితీపై డ్రోన్లు అందజేశారు. వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన విధానాలు వివరించారు. రైతే రాజు అన్న విధంగా సీఎం చంద్రబాబు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని జనసేన ఇంచార్జ్ సోమరాజు కొనియాడారు.