భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దండు నాగ భూషణం వయసు 25, శుక్రవారం ఉరి వేసుకుని మృతి చెందాడు. గత మూడు నెలలుగా మానసికంగా బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు తన తల్లి తెలిపినట్లు పోలీసులు తెలిపారు.ఇంట్లో సుసైడ్ నోట్ పెట్టి రేకుల నివాసంలో తాటి దూలానికి చీరతో ఉరి వేసుకుని మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై మృతుని తల్లి డి లక్ష్మీ పిర్యాదు పై కేసు నమోదు చేసి ఏ ఎస్ ఐ యూ నూకరాజు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.