జిల్లా కేంద్రంలోని డిసిసిబి కాలనీ పరిసర ప్రాంతాలలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడంతో ప్రజారోగ్యం ఎంతగానో మెరుగుపడుతుందన్నారు.