పెన్షన్ తొలగింపు విషయంలో అర్హులైన వారికి ఎటువంటి అన్యాయం జరగదని పూతలపట్టు ఎమ్మెల్యే డా. కలికిరి మురళీమోహన్ భరోసా ఇచ్చారు. వారు మాట్లాడుతూ— అనర్హుల తొలగింపు చర్యలలో భాగంగా అర్హుల పెన్షన్లు తప్పుగా రద్దయితే, సంబంధిత ఎంపీడీవోలకు రాతపూర్వక వినతులు అందజేస్తే పరిశీలించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.