సాయుధ దళ కార్యాలయం ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపిఎస్. నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలో గలల సాయుధ దళ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపిఎస్ తనిఖీ చేశారు. మొదటగా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. తదనంతరం సాయిధదళ కార్యాలయం పరిసరాలను, వాటి పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులందరినీ పిలిచి వారు నిర్వర్తిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు.