కుప్పం మండలంలోని పరమసముద్రం సమీపంలోని బేట్రాయి స్వామి కొండ ఆధ్యాత్మిక పర్యటక కేంద్రంగా విరజల్లుతోంది. సుమారు వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన బేట్రాయి స్వామి కొండపై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులచే నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఆలయం పైకి వెళ్లేందుకు ఇటీవల మెట్ల మార్గాన్ని సైతం ఏర్పాటు చేయగా నిత్యం భక్తుల సందడి పెరుగుతోంది. ఇక్కడి వాతావరణం సైతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది.