రౌడీ షీటర్ గా కేసు నమోదైన వారు సత్ప్రవర్తనతో మెలగాలని జనగామ సిఐ దామోదర్ రెడ్డి హెచ్చరించారు.శుక్రవారం సాయంత్రం జనగామ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లుగా కేసు నమోదైన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.గతంలో చేసిన తప్పులను తిరిగి చేయకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని,ఎలాంటి గొడవలకు వెళ్లకుండా సమాజంలో సత్ప్రవర్తనతో మెలిగి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.