క్రీడలు శారీరిక, మానసిక ఉల్లాసానికి ఎంతోగాను దోహదపడతాయని ట్రైనీ కలెక్టర్ సలోని పేర్కొన్నారు. క్రీడా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి నిర్వహించిన ర్యాలీని ఆమె క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. డివైఎస్ఓ శ్రీనివాస్, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి తదితరులున్నారు.