నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం 11 గంటల సమయంలో మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖ, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కాళోజీ నారాయణరావు 111వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా కవి కాళోజి నారాయణ రావు తన కవిత్వం రచనల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించిన మహానీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.