కడప జిల్లా జమ్మలమడుగు అర్బన్ సిఐ నరేష్ బాబు పలు విషయాలు ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు. ఆదివారం తెలిసిన వివరాల మేరకు జమ్మలమడుగు పట్టణము మరియు గ్రామాలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు పెట్టదలుచుకున్నవారు https:// Ganeshutsav.net లింకు నందు మాత్రమే దరఖాస్తులను నింపి ఆన్లైన్ నందు సబ్మిట్ చేసి పర్మిషన్ పొందాలన్నారు. మీరు వినాయక మండపాలకు పెట్టుకున్న ఆన్లైన్ దరఖాస్తులపైన విచారించి QR కోడ్ ఇస్తారన్నారు. వినాయక చవితి పండుగకు సంబంధించి ఎటువంటి చలానాలు కట్టవలసిన అవసరం లేదన్నారు. వినాయక విగ్రహాలు పెట్టుకున్న వారు కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.