మహిళలు కాదు వీళ్లు మహా కంత్రిలు..... బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మహిళలను ఏం మార్చి వారి నుంచి బంగారం దొంగతనం చేయడంలో వారు సిద్ధహస్తులుగా మారారు. పూసలు రోల్డ్ గోల్డ్ బంగారాన్ని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వీరు అందులో లాభం లేకపోవడంతో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడడం వీరి వృత్తిగా మార్చుకున్నారు. వీరిని అనంతపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీటికి సంబంధించి జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాకు వివరాలను వెల్లడించారు. వారి దగ్గర నుంచి 23 లక్షల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.