నల్లగొండ జిల్లా: గ్రామ పాలన అధికారులు పనిపై స్ఫూర్తి శ్రద్ధ వహించి విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆదిత్య భవన్లో నిర్వహించిన గ్రామ పాలన అధికారుల కౌన్సిలింగ్ కు హాజరై మాట్లాడుతూ గ్రామ పాలన అధికారుల కౌన్సిలింగ్ను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని ఇలాంటి సిఫారీసులకు పక్షపాతానికి ఇందులో తావు లేదన్నారు. గ్రామ పాలన అధికారులుగా ఉత్తర్వులు అందుకున్న వారు సోమవారం నూటికి నూరు శాతం విధుల్లో చేరాలన్నారు.