భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా చందాలో ఆయన పర్యటించారు. భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందే విధంగా ఒత్తిడి తీసుకొస్తామన్నారు.