ఆస్పరి మండలంలోని 33 గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, శనివారం సీఐ ఎ.గంగాధర్ తెలిపారు. రోడ్డు మీద అడ్డంగా మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని, విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిమజ్జనం 3 రోజులకే అనుమతి ఉందన్నారు. రెచ్చగొట్టే బ్యానర్లు ఉండకూడదని హెచ్చరించారు.