హెచ్ ఐ వి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు సంబంధింత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 8680 మందికి హెచ్ ఐ వి వ్యాధిగ్రస్తులుగా గుర్తించారని, వారికి ఆ వ్యాధి ఎవరి నుండి సోకిందో మూల కారణాలను తెలుసుకుని, వారికి కూడా ఏ ఆర్ టి చికిత్స అందించినప్పుడే వ్యాధి వ్యాప్తిని అరికట్టగలమన్నారు.