సోమశిల రిజర్వాయర్ కింద సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసామన్నారు. కండలేరు సోమశిల రిజర్వాయర్లో కలిపి 150 టీఎంసీ ల నీటిని నిల్వ చేస్తామన్నారు. గత ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవడమే మానేసిందని నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆగ్రహం వ్యక్తం చేశారు