రాయచోటి పట్టణం మాసాపేటలో శనివారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో కారును వేగంగా నడిపారు. ఓ ఇల్లు, బైక్ను ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా ఇద్దరికి ఎటువంటి గాయాలు కాలేదు. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.