అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బేతపల్లి గ్రామంలో సోలార్ పరిశ్రమకు సేకరించిన భూముల వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేసి దూషించిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై సీఎం చర్యలు తీసుకోవాలని గూడూరులో సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కార్యాలయంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి మోహన్, మండల నాయకులు రాజశేఖర్, మద్దిలేటి మాట్లాడారు.