గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కోరారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ పండుగ నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో, ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ..ఈసారి నగరంలో సుమారు 3300 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. నిర్వాహకులు పోలీస్ వెబ్ సైట్ లో గణేష్ మండపం పూర్తి వివరాలు నమోదు చేయాలని, తద్వారా వారికి తగిన సేవలు అందుతాయని తెలిపారు.