కేవిపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కె.వి.మండలం కేవిపల్లి నందు వై.యస్.ఆర్.సి.పి. పీలేరు నియోజకవర్గం వాలంటరీ విభాగం అధ్యక్షులు కొల్లు యర్రమ రెడ్డి ఇటీవల బైపాస్ సర్జరీ చేసుకున్నారు. విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గోరంట్ల పల్లి గ్రామం రెడ్డివారి పల్లి నందు కీ.శే కంభం క్రిష్ణా రెడ్డి దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా కె.వి.పల్లి నందు కె.వి.పల్లి మండల నాయకులను మరియు కార్యకర్తలను కలుసుకున్నారు. స్థానిక సమస్యల పై ఆరా తీశారు.