తిరుపతి జిల్లా వాకాడు మండల సరిధిలోని తూపిలిపాలెం సముద్ర తీరాన శుక్రవారం వినాయక విగ్రహాల నిమజ్జనాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం క్రేన్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ నాగబాబు తెలిపారు. వీటి వలన ప్రజలు ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండానే విగ్రహాలను కడలిలో నిమజ్జనం చేయవచ్చన్నారు. ఆయన తో పాటు పోలీసుల మెడికల్ సిబ్బంది ఉన్నారు