జగిత్యాల: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి జగిత్యాల (D) మల్లాపూర్ (M) ముత్యంపేటలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. టపాకాయలు పేలుస్తుండగా చిట్యాల అరవింద్ అనే యువకుడి కంట్లోకి ఒక టపాకాయ దూసుకెళ్లి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా పేల్చుతున్నప్పుడు ఒకటి పేలకపోవడంతో దాన్ని పరిశీలించడానికి దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలో టపాకాయ పేలి అందులోని నిప్పురవ్వ నేరుగా అతని కంట్లోకి దూసుకుపోవడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని నిజామాబాద్కు తరలించారు.