విజయనగరం జిల్లా పోలీసుశాఖలో హోంగార్ద్సుగా పని చేస్తూ, ఇటీవల రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి వెల్లడించిన ఫలితాల్లో సివిల్ కానిస్టేబుళ్ళుగా ఎంపికైన ఆరుగురు హోంగార్డులు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారిని అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పోలీసుశాఖలో హెూం గార్డులుగా పని చేస్తూ, వివిధ రకాలైన పోలీసు విధులను నిర్వహిస్తూ, సహాయకులుగా సమర్ధవంతంగా పని చేసారన్నారు. ఇకపై పోలీసుశాఖలో పూర్తి స్థాయిలో పని చేయుటకు కానిస్టేబుళ్ళుగా ఎంపికకావడంతో మీపై బాధ్యతలు కూడా పెరిగాయన్నారు.