సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న స్కార్పియో వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టగా కారులో ప్రయాణిస్తున్న వీరన్న పటేల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు.ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.