ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో వినాయక నిమజ్జన సందర్భంగా పోలీసులతో జరిగిన గొడవలో అరెస్టు అయ్యి జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న 45వ డివిజన్ మారుతి నగర్ కు చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తల కుటుంబాలను శుక్రవారం జిల్లా వైఎస్ఆర్సిపి ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం ఉందని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. వారి కుటుంబాలకు వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని పార్టీ కోసం ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ అండగా నిలుస్తుం