వికారాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు పొంగిపొర్లుతున్నాయని జిల్లాలో ప్రజలు ఎవరు కూడా వాగలు దాటి ప్రయత్నం చేయవద్దని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి జిల్లా ప్రజలను బుధవారం హెచ్చరించారు. వాగులు వంకలు పొంగి పొర్లే సమయంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా అత్యవసర సమస్య పరిస్థితి వస్తే 100 డయల్ గాని లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు.