నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తో కలిసి మంగళవారం పర్యటించారు. డోన్ పట్టణంలోని డంపింగ్ యార్డ్ లో లెగిసి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనులను ఎమ్మెల్యేతో కలిసి మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసి 85 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్ళిందని విమర్శించారు. మున్సిపల్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు 85 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ రెండు కల్లా తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడుఆదేశించినట్లు తెలిపారు