గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాహేగం కాగజ్నగర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయినం గ్రామ సమీపంలోని లో లెవెల్ వంతెన పైనుండి పూర్తిగా నీలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వందలాది ఎకరాలు పంట పొలాలు నీట మునిగిపోయాయి.