నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో సూర్యం 25వ వర్ధంతి సందర్బంగా వరగంటి మురళీధర్ రచించిన విప్లవ ప్రస్థానం అరని వెలుగు సూర్యం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ సోయం బాపూరావు, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుగుణ, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి హాజరయ్యారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సూర్యం బాల్యం నుండి ఉద్యమ ప్రస్థానం జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేసేందుకు పుస్తకం రూపొందించినట్లు తెలిపారు.