లేడీ డాన్ గా పిలవబడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన నిడిగుంట అరుణ ను గురువారం ఒంగోలు జైలు నుంచి కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం ఆమెను ఒంగోలు జైలు నుండి కోవూరు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. లేడీ డాన్ అరుణ ను మూడు రోజులపాటు పోలీసులు విచారణ చేయనున్నారు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలీసులు విచారణ చేసేందుకు అనుమతి తీసుకున్నారు విచారణ అనంతరం ఆమెను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తారు లోతుగా విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కస్టడీలోనికి తీసుకున్నారు.