ప్రతిపక్షంలో ఉన్న అనంతపురం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు.