జీవో నెంబర్ 49 రద్దు చేయాలని పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం గత ఐదు రోజుల నుండి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరిబాబు ఆరోగ్యం క్షీణించడంతో బిజెపి శ్రేణులు కాగజ్నగర్ బందుకు పిలుపునిచ్చారు. కాగజ్ నగర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి వ్యాపారాలను మూసి వేయించారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని బిజెపి నాయకులు తెలిపారు,