అబార్షన్స్ కేసులు అన్నింటినీ వెరిఫై చేసి వాటి యొక్క కారణాలను నివేదిక రూపంలో అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను డాక్టర్లను జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశించారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పిసి పి చట్టం కింద జిల్లా స్థాయి బహుళ సభ్యుల అప్రూవింగ్ అథారిటీ మరియు సలహాలపై జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ కమిటీ అధ్యక్ష హోదాలో సమావేశం నిర్వహించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వాసుపత్రిలో ఎక్కువ శాతం కాన్పులు జరగాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా గర్భిణీలకు సుఖప్రసవాలు జరగాలని అన్నారు