రానున్న బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపికి తొత్తుగా మారిన ఎన్నికల కమిషన్ బిజెపికి వ్యతిరేకంగా ఓట్లు వేసే 65 లక్షల మంది ఓట్లను తొలగించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఒంగోలు లో జరిగిన రాష్ట్ర మహా సభలకు ఆయన అధ్యక్షత వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో కూడా దొంగ ఓట్లు ద్వారానే కేంద్రంలోకి బిజెపి అధికారంలోకి వచ్చింది అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బిజెపికి అమ్ముడుపోయిందన్నారు. దీనిపై సాక్షాలతో సహా దొంగ ఓట్లను బయటపెట్టిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కి నోటీసులు ఇస్తూ బెదిరించాలని చూస్తుందన్నారు.