అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంగళవారం సాయంత్రం 6:30 సమయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. సూపర్ హిట్ సూపర్ సిక్స్ సభ అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం ఐదు కోట్ల మంది ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం కోసం నగరంలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగినదని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటు అని మంత్రి విమర్శించారు. జగన్ అసత్య ప్రచారాలు మానుకోవాలని మంత్రి అన్నారు.