కంచరపాలెం సమీపంలోని అక్రమంగా ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ఒక వ్యక్తిని కంచరపాలెం పోలీసులు అరెస్టు చేశారు. బండి శ్రీకాంత్ అనే వ్యక్తి ధర్మానగర్‌లోని తన పాన్‌షాపులో ఈ-సిగరెట్లు అమ్ముతున్నాడని వచ్చిన సమాచారం మేరకు, టాస్క్‌ఫోర్స్, కంచరపాలెం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. శ్రీకాంత్ పాన్‌షాపులో రూ. 56,000 విలువ చేసే 60 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. ఇదిలావుండగా ఈ కేసులో ఓ కానిసే‍్టబుల్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.