తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం రాచకండ్రిగ సమీపంలోని రోడ్డు మరమ్మత్తులకు గురైంది. ఈ మార్గం మీదుగా శ్రీకాళహస్తి నుండి చెన్నైకి ప్రతిరోజు వందలాది వాహనాలు ప్రయాణించాల్సి ఉంది. అయితే రహదారి మరమత్తులకు గురికావడంతో వాహనాల ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. గుంతలమైన రహదారి వల్ల ఆరోగ్యం పాడవడంతోపాటు వాహనాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఈ మార్గం గుండా వెళుతూ ఓ వాహనం గుంతలో పడి మరమ్మత్తులకు గురైంది. ఈ దారి మీదుగా స్థానిక అధికారులు సంబంధిత ప్రజాప్రతినిధులు వెళ్తున్న ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా సంబంధిత శ