గతేడాది, ఈ ఏడాది అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పంటనష్ట పరిహారం వెంటనే జమచేయాలని ఏపిఐఐసి మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మెట్టుగోవిందరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎప్పటికప్పుడు పరిహారం అందేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎటువంటి మేలు జరగడం లేదని విమర్శించారు. పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాసులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.