విజయనగరం జిల్లా రాజాంలో ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ ఉపేంద్ర సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలోని పొనుగుటి వలస సరిహద్దులలో ఇద్దరు మద్యం తాగారు. వారిని రైస్ మిల్ వద్ద మద్యం తాగొద్దని వాచ్మెన్ ముత్యాల నాయుడు అన్నాడు. దీంతో కోపోద్రిక్తులైన లారీ డ్రైవర్లు వాచ్మెన్పై దాడి చేశారు. నిందితులు విశాఖపట్నంలోని ఆనందపురం మండలం సిర్లపాలెంకు చెందిన బి. నాగరాజు, కె. చిన్నప్పలనాయుడిగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.