హుజూరాబాద్:నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక చవితి పురస్కరించుకొని జమ్మికుంట హుజురాబాద్ వీణవంక ఇల్లందకుంట మండలాలలో వినాయక చవితి సందడి నెలకొంది.పట్టణంతో పాటు మండల కేంద్రాలలో గణనాధులు మండపాలలో కొలువు దిరారు.వినాయక పూజకు సంబంధించిన వస్తువుల కోసం పట్టణం నుండే కాకుండా ఇతర గ్రామాల నుండి ప్రజలు తరలి వస్తున్నారు. బుధవారం ఉదయం పట్టణం లోని సూపర్ బజార్ రోడ్డు అంబేద్కర్ చౌరస్తా జనాలతో కిక్కిరిసిపోయింది.నేటి నుండి తొమ్మిది రోజుల పాటు వినాయకులు పూజలు అందుకోనున్నాయి.